అయ్యర్, రాహుల్ జట్టులోకి వస్తారని.. నమ్మకం పెట్టుకోవద్దు : రోహిత్
అదిగో వస్తారు ఇదిగో వస్తారు అని వార్తలు రావడం తప్ప.. ఇక వారిద్దరు ఫిట్నెస్ సాధించారా లేదా అన్న విషయంపై అటు బీసీసీఐ కూడా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. అయితే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నాటికి వాళ్ళు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ క్రమంలోనే గాయాల నుంచి కోలుకుంటున్న రాహుల్, అయ్యర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయాలు సర్జరీల నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మునుపటిలా క్రికెట్ లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే ఒక్కసారి గాయం బారిన పడిన ఆటగాడు జట్టుకు క్రికెట్ కి దూరమైన తర్వాత మళ్లీ కోలుకున్న తర్వాత వారికోసం జట్టులో స్థానం సిద్ధంగా ఉందని ఎవరికి కూడా హామీ ఇవ్వలేము. ఎందుకంటే భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా పోటీ పడాల్సిందే. ఇక త్వరలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టు కూర్పు గురించి చర్చిస్తాము అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పించాడు. అయితే రోహిత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీని ప్రకారం చూసుకుంటే గాయం నుంచి కోల్కున్నప్పటికీ అయ్యర్, రాహుల్ జట్టులోకి వస్తారు అనే నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు అన్నట్లుగా రోహిత్ కామెంట్ చేశాడని అందరూ భావిస్తున్నారు.