కోచ్ లేకుండానే ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడిపోతుంది. అయితే ఈ టి20 సిరీస్ కోసం ఇండియా జట్టు వివరాలను ప్రకటించింది. ఏకంగా 18 మంది సభ్యులతో కూడిన వివరాలను తెలిపింది. అయితే ఇక ఎన్నో రోజులుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు అతనికి కెప్టెన్సీ కూడా అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈనెల 18వ తేదీ నుంచి ఇక ఐర్లాండ్‌తో మూడు టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక బుమ్రా తన కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.
అయితే ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీమ్ ఇండియా కోచ్ లేకుండానే అక్కడ సిరీస్ ఆడబోతుండట అయితే ఈ సిరీస్ కు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గైర్హాజరితో వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తారు అనే వార్తలు వినిపించాయ్. అయితే ఈ సిరీస్ కు అటు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు అన్నది నేషనల్ క్రికెట్ అకాడమీ తెలిపింది. దీంతో కోచ్ లేకుండానే అటు టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళబోతుంది. అయితే వీవీఎస్ లక్ష్మణ్ లేకపోవడంతో సీతాన్షు కోటక్, సాయి రాజులు ఇక టీమిండియా బాధ్యతలను పర్యవేక్షిస్తూ ఉంటారట.