టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారట?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాను గాయాలు బెడద  తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ప్రధాన ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు గాయం బారిన పడుతూ కొన్ని నెలలపాటు ఇక భారత జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు సంవత్సరం పాటు ఇక క్రికెట్ ఆడలేని పరిస్థితి ఉంది. ఇక బుమ్రా  వెన్నునొప్పి గాయం కారణంగా దాదాపు పది నెలల నుంచి అటు టీమిండియా జట్టులో కనిపించడం లేదు. అయితే ఐపీఎల్ కారణంగా అటు శ్రేయస్ అయ్యర్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడ్డారు.


 అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా ఆడబోతుంది టీం ఇండియా. అయితే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో గాయం బారిన పడిన కీలక ప్లేయర్లు కోలుకొని మళ్ళీ జట్టులోకి రావాలని భారత జట్టు అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి రోజుకో వార్త తెరమీదకి వస్తుంది. దీంతో అటు ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది.



 భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు అయినా శ్రేయస్,  కేఎల్ రాహుల్ లు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలే పుష్కలంగా కనబడుతున్నాయట  అయితే గాయాల బారిన పడి చికిత్స చేయించుకున్న ఇద్దరు ప్లేయర్లు కూడా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ లో తెగ కష్టపడుతున్నారు. ఇక ఇటీవల రాహుల్ శ్రేయస్ ఆసియా కప్ అందుబాటులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడు కూడా చిన్న హింట్ ఇచ్చాడు. కాగా ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా ఒక ప్రారంభం కానుండగా.. మరో రెండు రోజుల్లో అటు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: