నేపాల్లో హోటల్.. బెంగళూరులో గెస్ట్ హౌస్.. కానీ అతనొక దొంగ?

praveen
సాధారణంగా ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం చేతకాని వారు దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏదైనా షాప్ లేదా ఇల్లు చూసుకొని ఇక అందులో చోరీకి పాల్పాడటం చేస్తూ ఉంటారు. ఇక ఇలా చోరీ చేయగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసి పూట గడుపుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే భారీ దొంగతనాలు చేయాలని ప్రయత్నించి ఎంతో సెక్యూరిటీ ఉండే బ్యాంకుల ను లూటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా డబ్బులు లేని వారు చోరీలు చేయడం ఇప్పటివరకు చూశాము.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తికి ఏకంగా ఫామ్ హౌస్ తో పాటు ఒక విల్లా కూడా ఉంది.. ఒక రెస్టారెంట్ ను కూడా కొన్నాడు.  కానీ అతను చోరీలు చేస్తున్నాడు. ఇంతకీ అతగాడికి ఇంత ఆస్తి ఎక్కడిది అనుకుంటున్నారా.. ఇంకా ఎక్కడిది చోరీలు చేయడం ద్వారానే అతడు కోట్లు కూడపెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ లో వెలుగులోకి వచ్చింది. మనోజ్ చౌబే అనే యువకుడు 1997లో ఢిల్లీకి వలస వచ్చి కీర్తి నగర్ లో ఒక క్యాంటీన్ ప్రారంభించాడు. అయితే కొన్నిసార్లు చోరీలకు పాల్పడి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇలా చోరీ చేసిన సొమ్ముతో ఏకంగా ఒక విల్లాతో పాటు నేపాల్ లో హోటల్ కూడా నిర్మించుకున్నాడు.


 ఇక తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పార్కింగ్ కాంట్రాక్టు తీసుకున్నానని భార్యను నమ్మించి ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ఢిల్లీలోనే ఉండేవాడు మనోజ్. ఇక చోరీ చేదుగా వచ్చిన డబ్బులతో యూపీలో భార్య పేరుట ఒక అతిధి గృహం, లక్నోలో ఇల్లు కూడా కొన్నాడు. ఇక పలు స్థిరాస్తులను కూడా కొనుగోలు చేశాడు. ఇక ఆస్తులు ద్వారానే అతనికి దాదాపు ప్రతినెల 2 లక్షల రూపాయల అద్దెలు వస్తాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మనోజ్ పై నిఘా పెట్టిన పోలీసులు 200 చోరీలు చేసిన ఇతగాడిని చివరికి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ క్రమంలోనే అతని ఆస్తులు చిట్టా చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: