యువి, ధోని తర్వాత.. టీమిండియా ఆ లోటు తీర్చలేక పోయింది : అశ్విన్
కానీ ఇద్దరు ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అటు టీమ్ ఇండియాకు నాలుగు ఐదు స్థానాల్లో కొత్త బ్యాట్స్మెన్లను సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది అయితే నాలుగవ స్థానంలో అయ్యర్ ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ సెట్ అయ్యారు అని అనుకునే లోపే ఈ ఇద్దరు ప్లేయర్లు అటు గాయం బారిన పడ్డారు. అయితే ఇప్పుడు కోలుకొని జట్టులోకి వచ్చినప్పటికీ మునిపటి ఫామ్ అందుకుంటారో లేదో అనే విషయంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయం గురించి అటు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, యువరాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత నాలుగు ఐదు స్థానాల కోసం బీసీసీఐ సరైన ఆటగాడిని రీప్లేస్ చేయలేకపోయింది అంటూ అశ్విన్ కామెంట్ చేసాడు.
నాలుగో స్థానంలో యువి, ఐదో స్థానంలో ధోని రావడం వల్ల భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండేది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ ఇలాంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అతను 5వ స్థానంలో సరిపోతాడు అని అనిపిస్తుంది. ఇక పంత్ గాయపడకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ కావడంతో పాటు దూకుడుగా ఆడే పంత్ జట్టులో ఉంటే ఇక టీమిడియాకు ఎంతో కలిసివచ్చేది. కేఎల్ రాహుల్ ఎంత ముఖ్యమో అయ్యర్ కూడా అంతే కీలకం. భారత బ్యాటింగ్ ఆర్డర్ లో అయ్యర్ కీలక ఆటగాడు. నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. స్పిన్ బౌలర్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. గతంలోనూ ఇదే స్థానంలో కీలక ఇన్నింగ్స్ లో ఆడాడు. అతను ఫిట్నెస్ సాధిస్తే ఇక నాలుగో స్థానానికి డోకా ఉండదు అంటూ అశ్విన్ వ్యాఖ్యానించాడు.