టీమిండియాలోకి అతనోచ్చేస్తున్నాడు.. ఇక మన తెలుగోడికి ఛాన్స్ లేనట్టేనా?
ఇక మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సైతం గాయం నుంచి కోలుకుని మళ్ళీ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. ఇక ఆసియా కప్ లో టీం ఇండియా విజయాల్లో కీలకపాత్ర వహిస్తాడు అనుకున్న కేఎల్ రాహుల్ మాత్రం.. ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అన్న వార్త అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్లో అందుబాటులో లేకుండా పోయిన కేఎల్ రాహుల్ ఇక ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతను జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఒకవైపు జట్టులోకి వచ్చిన బుమ్రా అందుబాటులో లేకుండా ఇక లీవ్ మీద స్వదేశానికి వెళ్తున్నాడు అన్న షాక్ తగలగా అటు ఇప్పుడు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కేఎల్ రాహుల్ ఫిట్నెస్ కోసం వేచి చూసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఈరోజు లేదంటే రేపు వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. రాహుల్ జట్టులోకి వస్తే సంజూ చోటు గల్లంతైనట్టే. అదే సమయంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ప్రసిద్ కృష్ణలకు కూడా జట్టులో చోటు తగ్గకపోవచ్చు.