మిడిల్ ఫింగర్ చూపించడంపై.. గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
అయితే ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే గౌతమ్ గంభీర్ ఇక అటు క్రికెట్తో మాత్రమే కాదు వివాదాలతో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఏదో ఒక క్రికెటర్ తో గొడవ పెట్టుకోవడం చేస్తూ ఉంటాడు. అయితే గత కొంతకాలం నుంచి టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్ వివాదం కొనసాగుతూ వస్తుంది. ఐపీఎల్లో లక్నో బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవపై ఇప్పటికి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల నేపాల్తో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
గౌతమ్ గంభీర్ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అభిమానులందరూ కూడా విరాట్ కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఎంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ గంభీర్ తన మిడిల్ ఫింగర్ చూపించాడు. దీంతో ఎంతోమంది గంభీర్ పై విమర్శలు చేశారు. కాగా ఇదే విషయంపై గౌతమ్ స్పందించాడు. నిజం తన బూట్లు వేసుకునేలోపు అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేయగలదు. ప్రతిదీ మనకు కనిపించినట్లు ఉండదు. మన దేశానికి వ్యతిరేకంగా చేసే నినాదాలకు నేను ఎలా స్పందించానో.. ఏ భారతీయుడైన అలాగే స్పందిస్తాడు. నేను మన ఆటగాళ్లు మన దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ గౌతమ్ గంభీర్ పోస్ట్ పెట్టాడు.