తెలుగోడికి అన్యాయం జరిగితే.. టీమ్ ఇండియాకు ఓటమేనా?

praveen
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ప్లేయర్ కూడా వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కించుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక రెండేళ్లకు ఒకసారి వచ్చే వరల్డ్ కప్ కంటే నాలుగేళ్ల కొక్కసారి వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటారు ఆటగాళ్లు. అయితే మంచి ప్రదర్శన చేసి జట్టులో చోటు దక్కుతుంది అని ఆశపడిన సమయంలో  చివరి నిమిషంలో ప్రపంచకప్ నుంచి పక్కన పెడితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు వరకు ఎక్కువసార్లు మన తెలుగు క్రికెటర్లు ఇలాంటి బాధ అనుభవించారు. సెలెక్షన్ కమిటీ చేసిన ఈ తప్పిదాలు చివరికి టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీస్తాయి అని చెప్పాలి. 2003 ప్రపంచ కప్ కి ముందు హైదరాబాద్ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ కు చివరి నిమిషంలో మొండి చేయి చూపించారు సెలక్టర్లు. ఇక అప్పుడు ప్రపంచకప్ ఓడిపోయింది టీమిండియా. ఇక 2019లో తెలుగుదేశం అంబటి రాయుడుకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు తిలక్ వర్మని కూడా ఇలాగే వన్డే వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేసారూ.


 2003 ప్రపంచ కప్ సమయంలో వివిఎస్ లక్ష్మణ్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. అతనికి తప్పకుండా వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ దారుణంగా విఫలమవుతున్న దినేష్ మోంగియాను తీసుకొని వివిఎస్ లక్ష్మణ్ ను పక్కన పెట్టారు. దీంతో లక్ష్మన్ను తీసుకుని ఉంటే టీమిండియా ప్రపంచ కప్ గెలిచేదిఅని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.  2019లో అంబటి రాయుడుకు బదులు ఆల్రౌండర్ విజయ శంకర్ ను ఎంపిక చేశారు. అతను ఎక్కడ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అప్పుడు వరల్డ్ కప్ ఓడిపోయింది. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న తిలక్ ను పక్కన పెట్టేసి అన్యాయం చేశారు. దీంతో మరోసారి టీమ్టీమ్ ఇండియాకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: