అందుకే పాక్ ఫేసర్ల బౌలింగ్లో.. తడబడతాం : గిల్
ఇక అందరూ ఆటగాళ్లు కూడా తక్కువ పరుగులు చేసి వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తక్కువ పరుగులకే ఎక్కువ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూడుకుపోయింది. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ ఎలా రాణించబోతుందో అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల ఇదే విషయం గురించి టీమ్ ఇండియా ప్లేయర్ గిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేరే జట్ల లాగా తాము పాకిస్తాన్తో తరచూ మ్యాచ్ లు ఆడము అందుకే ఆ దేశ ఫేసర్లను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉండదు అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. అందుకే ప్రపంచ కప్ లో ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ బోలర్లపై ఆరంభంలో టాప్ ఆర్డర్ లో తడబాటు కనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. తరచూ మ్యాచులు జరిగితే వారిపై అత్యుత్తమంగా ఎటాక్ చేయగలం అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబర్ 2న జరిగిన మ్యాచ్లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే.. చేసి వికెట్ కోల్పోయాడు గిల్.
అయితే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే టీమిండియా అన్ని దేశాలతో ఆడినట్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడదు. అదే సమయంలో ఇక పాకిస్తాన్ ప్లేయర్లు అటు ఐపిఎల్ లో ఆడేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ఇక పాకిస్తాన్ జట్టు పేసర్లను ఎదుర్కొనేందుకు కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో తప్ప ఎక్కడ కూడా భారత బ్యాట్స్మెన్ లకు అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి.