భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి కొలంబో ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొన్ననే వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇప్పుడు కూడా వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ఈరోజు జరిగే మ్యాచ్ అయిన జరుగుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. ఇదే విషయంపై అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకవేళ వర్షం పడినప్పటికీ.. మ్యాచ్ ను రద్దు చేయకుండా.. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం.. ప్రత్యేకంగా రిజర్వుడేని ఏర్పాటు చేస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇక ఇప్పుడు జరగబోయే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి అటు అభిమానులకు బ్యాడ్ న్యూస్ తప్పదు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే సూపర్ 4 లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ కి 90% వర్షం ముప్పు ఉందని తెలుస్తుంది. అయితే వర్షం వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే.. ఎల్లుండి రిజర్వుడే ఉంటుంది. కానీ ఇక రిజర్వుడే రోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఎక్కువగానే ఉందట. దీంతో మొన్న ఎలాగో అర్థం అయింది. కనీసం ఇప్పుడైనా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూసే అదృష్టం లభిస్తుందో లేదో అని అభిమానులు అనుకుంటున్నారు. వర్షం పడకపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే ఒకవైపు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది అనే సంతోషం ఉన్నప్పటికీ ఇక వర్షం అంతరాయం కారణంగా ఏం జరుగుతుందో అనే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో నిండిపోయింది అని చెప్పాలి.