అయ్యర్ నిజంగా గాయపడ్డాడా.. రాహుల్ కోసం కుంటి సాకులా?

praveen
ఇటీవల కాలంలో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను సైతం పక్కన పెట్టేసి ఇక గాయాల బారిన పడి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించారో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటూ ఉండటం పై విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ విషయంలో టీమ్ ఇండియా సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అటు భారత అభిమానులు అందరికీ కూడా ఎవ్వరికి నచ్చడం లేదు.


 గాయం కారణంగా కేఎల్ రాహుల్ కొన్ని నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవల పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు అంటూ సెలెక్టరు చెప్పారు. దీంతో అతనికి ఇక పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో కూడా చోటు కల్పించారు. ఇక అతను జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారు అని అందరూ ఆలోచిస్తున్న వేళ శ్రేయస్ అయ్యర్ వెనునొప్పి గాయంతో బాధపడుతున్నానని అతని పక్కన పెడుతున్నామంటూ సెలెక్టర్లు తెలిపారు. అయితే దీనిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.


 ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కూడా కేఎల్ రాహుల్ మాదిరిగానే గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఏకంగా శస్త్ర చికిత్స కూడా చేసుకొని కోలుకున్నాడు. దాంతో ఆసియా కప్ కోసం అతని ఎంపిక చేశారు. గ్రూప్ దశలో పాకిస్తాన్తో జరిగిన పోరులో అత్తను బ్యాటింగ్ చేసి 13 పరుగులు చేశాడు. తనకు ఎలాంటి వెన్నునొప్పి లేదు అన్న విషయాన్ని కూడా పేర్కొన్నాడు. ఇక నేపాల్తో మ్యాచ్లో 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు. సూపర్ ఫోర్ మ్యాచ్కి ముందు కూడా నెట్ ప్రాక్టీస్ సమయంలో నొప్పి ఉన్నట్లు ఎక్కడ కనిపించలేదు. కానీ అనూహ్యంగా మ్యాచ్ ఆరంభానికి ముందు మేనేజ్మెంట్ వెన్నునొప్పి కారణంగా అతను ఆడటం లేదని ప్రకటించింది. కానీ కావాలనే కేఎల్ రాహుల్ కోసం శ్రేయస్ అయ్యర్ ను   పక్కన పెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. ఒక ఆటగాడి పట్ల ఇలా వివక్ష ఎలా చూపుతారు అంటూ ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: