వర్షంతో బ్రతికిపోయారు.. అక్తర్ షాకింగ్ కామెంట్స్?
పాకిస్తాన్, టీం ఇండియా తలపడ్డ సూపర్ 4 మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియం లో జరుగుతుంది. ఈ మ్యాచ్ కు మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఐతే ఈ నిర్ణయాన్ని చాలామంది విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసాడు. బాబర్ బుర్ర తక్కువ పని చేసాడని మండిపడ్డాడు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా బాబర్ తీసుకున్న ఈ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేసాడు. పాకిస్తాన్ టీం ను వరుణ దేవుడు ఆడుకున్నాడని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
టాస్ వోడి మొదట బాటింగ్ కు దిగిన భారత్ 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగుల చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 (4 సిక్సలు, 6 ఫోర్లు), శుబమన్ గిల్ 52 బంతుల్లో 58 (10 ఫోర్లు) తో పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డారు. దీంతో భారత్ కు మంచి ఆరంభం లభించింది. వీరిద్దరూ అవుట్ అయినా కొద్దీ సేపటికే వర్షం కారణం గా మ్యాచ్ నిలిచిపోయింది. ఐతే రిజర్వు డే కారణం గా ఈ మ్యాచ్ సోమవారం యధావిధిగా జరుగుతుందని ఆనుతున్నారు యాజమాన్యం. ప్రస్తుతం కోహ్లీ, కే ఎల్ రాహుల్ బాటింగ్ చేస్తున్నారు.