సచిన్, ఆఫ్రిది ల రికార్డులను బద్దలు కొట్టే దిశగా రోహిత్ శర్మ?

praveen
ఆసియ కప్పా లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో విఫలమైన రోహిత్ శర్మ సూపర్ 4 మ్యాచ్ లో చెలరేగాడు. శుభమాన్ గిల్ తో కలిసి పాకిస్తాన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సిక్సులు, ఫోర్లతో స్టేడియంను హోరెత్తించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 (4 సిక్సలు, 6 ఫోర్లు), శుబమన్ గిల్ 52 బంతుల్లో 58 (10 ఫోర్లు) తో పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక అరుదయిన ఘనత సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరున ఉన్న ఒక రికార్డును సమం చేసాడు. అదేమిటో ఇప్పుడు చూదాం.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ రోహిత్ కు 50వది. ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ వన్ డే క్రికెట్ లో 50 హాఫ్ సెంచరీలు సాధించిన ఆరొవ ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. సచిన్ (96), ద్రావిడ్ (83), ధోని (73), గంగూలీ (72), కోహ్లీ (63), రోహిత్ కంటే ముందు ఈ ఘనత సాధించారు. ఐతే ఈ మ్యాచ్ల్లో రోహిత్ సాధించిన హాఫ్ సెంచరీ అతనికి ఆసియ కప్ లో 9వది. ఇప్పుడు రోహిత్ భారత తరుపున ఆసియ కప్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తో పాటు మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీ లో రోహిత్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది.

ఇదే మ్యాచ్ల్లో రోహిత్ శర్మ మరో ఘనత కూడా సాధించాడు. పాకిస్తాన్ ప్లేయర్ పేరున ఉన్న మరో రికార్డును కూడా సమం చేసాడు. ఇప్పటివరకు ఆసియ కప్ లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది. ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేసాడు. వీళ్లిద్దరు ఆసియ కప్ లో 26 సిక్సులు కొట్టారు. ఈ టోర్నీలో రోహిత్ మరో సిక్స్ కొడితే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి ఓపెనర్ గా 300 మ్యాచ్లు పూర్తిచేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడే భారత ప్లేయర్ రోహిత్. అతని కంటే ముందు సచిన్ (346), సెహ్వాగ్ (321) ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: