ఆసియ కప్ లో రికార్డుల మోత.. చెలరేగుతున్న రోహిత్ శర్మ?

praveen
ఆసియ కప్ లో సరికొత్త రికార్డుల సృష్టిస్తున్నాడు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సెప్టెంబర్ 11 న కొలంబో లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 సిక్సులు బాది, ఆసియ కప్ లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ని సమం చేసాడు రోహిత్. ఆఫ్రిది ఆసియ కప్ లో 21 ఇన్నింగ్స్ లో 26 సిక్సులు బాది మొదటి స్థానంలో ఉంటె, ఇప్పుడు రోహిత్ 24 ఇన్నింగ్స్ లో 26 సిక్సులు బాది ఆఫ్రిది తో సమంగా మొదటి స్థానం లో నిలిచాడు. ఇప్పుడు తాజాగా శ్రీ లంక తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో మరో రెండు సిక్సులు బాది ఆఫ్రిదిని కూడా వెనక్కు నెట్టేశాడు రోహిత్. ఇప్పటివరకు ఆసియ కప్ లో 25 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ, 28 సిక్సులు కొట్టి మొదటిస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇదే మ్యాచ్ లో రోహిత్ మరో మైలురాయిని కూడా దాటేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లో 10000 పరుగులు పూర్తి చేసిన భారత ప్లేయర్ల జాబితాలో రెండో స్థానం సంపాదించాడు రోహిత్. ఈ జాబితాలో 205 ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, 241 ఇన్నింగ్స్ లో 10000 పరుగులు పూర్తి చేసి రోహిత్ రెండో స్థానాన్ని సాధించాడు. 259 ఇన్నింగ్స్ తో సచిన్ టెండూల్కర్, 263 ఇన్నింగ్స్ తో గంగూలీ ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాలలో ఉన్నారు. అంతే కాదండి....ఇప్పటి వరకు ఆసియ కప్ లో భారత్ కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ లు గెలిచింది మహేంద్ర సింగ్ ధోని. ధోని కెప్టెన్ గా ఆసియ కప్ లో ఇండియన్ టీం ను 9 సార్లు విజయ పదం పై నడిపించాడు. రోహిత్ కెప్టెన్ గా ఇప్పటికి 8 మ్యాచ్ లు గెలిచాడు. మరొక మ్యాచ్ గెలిస్తే ధోని పేరిట ఉన్న ఈ రికార్డు ను కూడా అధిగమిస్తాడు రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: