హాట్ స్టార్ లో సరికొత్త రికార్డు.. దాయాదులు తలపెడితే అంతే?
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ డిజిటల్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. కాగా ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హాట్ స్టార్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెల్కొలిపింది. ఈ మ్యాచ్ ను లైవ్ లో ఏకంగా మూడు కోట్ల మంది వీక్షించారు. ఐతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మ్యాచ్ ను ఫ్రీ గా స్ట్రీమ్ చెయ్యడమే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఐపీల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన జియో సినిమా, ఐపీల్ ఫ్రీ గా చూసే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇదే స్ట్రాటజీ ని ఫాలో అవుతూ హాట్ స్టార్ కూడా తన యూసర్ బేస్ పెంచుకునేందుకు ఆసియ కప్ ఫ్రీ స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించింది. కాగా హాట్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయం వలన గత డిజిటల్ ప్లేట్ ఫారం రికార్డులన్నీ తిరగరాసింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్.
ఐతే గతం లో కూడా అత్యధిక వ్యూవర్ షిప్ రికార్డు హాట్ స్టార్ పేరున ఉండడం విశేషం. గతంలో జరిగిన టి 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ను కోటి ఎనబై లక్షల మంది చూసారు. ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ పై ఇండియా విజయం సాధించింది. ఇప్పుడు ఆ సంఖ్య రెండింతలయింది.