పాపం డేవిడ్ వార్నర్.. షూ వల్ల అవుట్ అయ్యాడు?
ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఐదు మ్యాచ్లలో వన్డే సిరీస్ ఆడుతుంది ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ లలో వరసగా విజయాలు సాధించింది. ఇక ఇటీవల మూడో వన్డే మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 34.3 ఓవర్లలో 227 పరుగులతో అన్ని వికెట్లు కోల్పోయి పరాజయం పాలయింది. ఇక దక్షిణాఫ్రికా 111 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అవుట్ అయిన తీరు మాత్రం సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఏకంగా 78 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. 56 బంతుల్లోనే 78 పరుగులు సాధించగా.. ఇందులో 10 ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే అతను షూ కారణంగా అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఏకంగా అతని షూ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో సరైన సమయానికి తన కాలిని క్రీజ్ లో పెట్టలేకపోయాడు. చివరికి ప్రత్యర్ధులు ఇది గమనించి అతని రన్ అవుట్ చేశారు. దీని గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.