ఆసియా కప్ గెలిస్తేనే.. టీమిండియా వరల్డ్ కప్ గెలవగలదు?

praveen
మరికొన్ని రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్ని ఆరంభం కాబోతుంది. ఈ క్రమంలోనే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో అటు టీమ్ ఇండియా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే 2011 తర్వాత టీమ్ ఇండియా ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. దీంతో ఇక వరల్డ్ కప్ గెలవడం అనేది అటు భారత జట్టుకు అందని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈసారి సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో తప్పనిసరిగా టీమిండియా విశ్వ విజేతగా నిలుస్తుందని ఎంతోమంది ఫాన్స్ కూడా అభిప్రాయం చేస్తూ ఉన్నారు.


 ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఎన్నో స్ట్రాంగ్ టీమ్స్ తో పోటీ పడాల్సి ఉంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టీమ్స్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి.  ఇక ఆ టీమ్స్ తో పోటీపడి టీమిండియా ఎంతవరకు విజయాన్ని సాధించగలదు అనే విషయంపై కూడా సందేహాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి సందేహాలు మొత్తం పటాపంచలు కావాలి అంటే.. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ గెలవాల్సి ఉంది అని చెప్పాలి. ఇప్పటికే ఆసియా కప్ లో ఫైనల్ కు చేరుకుంది టీం ఇండియా.


 ఆసియా కప్ ఫైనల్లో భాగంగా శ్రీలంక టీం తో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఈ మ్యాచ్ లో గెలిచి ఆసియా కప్ విజేతగా నిలిచింది అంటే చాలు టీం ఇండియా తప్పకుండా సొంతగడ్డపై వరల్డ్ కప్ కూడా గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఆటగాళ్లలో మాత్రమే కాదు ప్రేక్షకుల్లో కూడా పెరిగిపోతుంది. ఒకవేళ ఇదే టీమ్ ఇండియా ఆసియా కప్ గెలవకపోతే మాత్రం ఇక అటు వరల్డ్ కప్ లో కూడా సాధించేది ఏమీ లేదు అని అందరూ కూడా ముందే ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది అని చెప్పాలి. అందుకే టీమిండియా సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవాలంటే ఇక ఎప్పుడు శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ గెలవాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: