ధోని కాదు.. డెత్ ఓవర్లలో అతన్ని ఆపడం అసాధ్యమంటున్న కోహ్లీ?

praveen
టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని కెప్టెన్గా ఎంతలా గుర్తింపు సంపాదించుకున్నాడో ఇక డెత్ ఓవర్లలో సూపర్ బ్యాటింగ్ చేసి ఫినిషర్ గా కూడా అంతే గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంత మంది బ్యాట్స్మెన్లు అవుట్ అయినా సరే ధోని క్రీజులో ఉన్నాడు అంటే చాలు టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అటు ప్రేక్షకులు అందరూ కూడా నమ్మేవారు అని చెప్పాలి. ఇలా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ధోని కంటే మరొక బ్యాట్స్మెన్ డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించగలడు అంటూ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇలా ధోని కంటే డెత్ ఓవర్లలో బాగా ఆడగలడు అని అశ్విన్ చెప్పిన ఆటగాడు ఎవరో కాదు రోహిత్ శర్మ. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ గురించి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బయటపెట్టాడు. ఓ మ్యాచ్ లో రోహిత్ క్రీజ్ లో ఉండగా అతని బ్యాటింగ్ గురించి కోహ్లీ, అశ్విన్ మాట్లాడుకున్నారట. ఇదే విషయం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని గురించి నేను కోహ్లీ మాట్లాడుకున్నాం. రోహిత్ ని చూసి అస్సలు అతన్ని ఆపాలంటే ఎక్కడ బౌలింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నా. 15- 20 ఓవర్ లలో రోహిత్  సెట్ అయితే తనకు ఎలా బౌలింగ్ చేయాలో కూడా ఎవరు ఊహించలేరు.


 డెత్ ఓవర్లలో  ఒక కెప్టెన్ కు భయంకరమైన పీడకల ఎవరో తెలుసా అని కోహ్లీ నన్ను అడిగాను. కోహ్లీ ప్రశ్నకు కొంచెం ఆలోచించి ధోనినా అని సమాధానం చెప్పాను. కాదు రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ సమాధానం చెప్పాడు. అదేంటి అని అడిగితే అసలు రోహిత్ ని ఆపడానికి ఎక్కడ బౌలింగ్ చేయాలో  కూడా ఎవరికి తెలియదు అంటూ విరాట్ కోహ్లీ వివరించాడు అంటూ ఒకప్పటి కోహ్లీ వ్యాఖ్యలను ఇటీవల అశ్విన్ తన యూట్యూబ్ వేదికగా గుర్తు చేసుకున్నాడు. అయితే చివరి వరకు రోహిత్ క్రీజు లో ఉంటే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో 2014లో అతను బాదిన 264 పరుగుల ఇన్నింగ్స్ చూసి అందరికీ అర్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: