అతన్ని ధోనితో పోల్చను.. కానీ అదరగొడుతున్నాడు : అశ్విన్
ఈ క్రమంలోనే భారత జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ అందరిని పక్కనపెట్టి కేఎల్ రాహుల్ ని.. ఫామ్ లో ఉన్నాడో లేడో కూడా తెలియకుండా ఎలా జట్టులోకి తీసుకుంటారు అంటూ కొంతమంది విమర్శలు కూడా చేశారు. అయితే ఇలా తనపై వస్తున్న విమర్శలు అన్నింటికీ కూడా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో అజయమైన సెంచరీ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోను కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చేశాడు. ఇక రాహుల్ రాకతో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగంలో స్థిరత్వం వచ్చింది అంటూ ఈ ప్రస్తుతం అతనిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నారూ.
ఇక ఇటీవలే ఇదే విషయం గురించి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం అనేది.. అంత తేలికైన విషయం కాదు. ఆ స్థానంలో ఆడటం ఒక కళ. అందులో ధోని ఆరితేరాడు. నేను ధోనితో రాహుల్ ని పోల్చను. కానీ ఆరు ఏడు స్థానాల్లో ధోని పోషించిన పాత్ర భిన్నమైనది. కానీ ప్రస్తుతం మిడిల్ ఆర్డర్లో తన బాధ్యతను రాహుల్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. అతను చక్కని ప్రణాళికతో బ్యాటింగ్ చేస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్లో బ్యాటింగ్ కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ తో కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించిన తీరు అద్భుతం అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.