ప్రపంచ క్రికెట్లోకి.. అడుగుపెట్టిన కొత్త జట్టు?

praveen
ఇటీవల కాలంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ అటు ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు అటు క్రికెట్ ని పట్టించుకోని ప్రేక్షకులు సైతం ఇక ఇప్పుడు క్రికెట్ చూడటానికి మక్కువ చూపుతున్నారు. అదే సమయంలో ఇక అసలు క్రికెట్ జట్టు లేని దేశాలు సైతం  ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోకి ఒక కొత్త జట్టు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి చైనా వేదికగా ఆసియా గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి.


 ఈ ఆసియా గేమ్స్ లో తొలిసారి భారత క్రికెటర్లు పాల్గొంటూ ఉండడంతో ఇక ఈ టోర్నికే సరికొత్త కల వచ్చింది అని చెప్పాలి  అయితే మొత్తంగా ఈ టోర్నీలో 14 క్రికెట్ టీమ్స్ పోటీలో పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. ఇందులో కేవలం అయిదారు జట్లు మాత్రమే.. అటు క్రికెట్ అభిమానులకు తెలిసినవి. మిగిలిన అన్నీ కూడా క్రికెట్ ఆడుతాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక ఇలాంటి టీమ్స్ లో అటు జపాన్ క్రికెట్ జట్టు కూడా ఒకటి. ఆసియా క్రీడల కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును జపాన్ జాతీయ క్రికెట్ బోర్డు ప్రకటించింది.



 అయితే జపాన్ టీం ప్రకటించిన జట్టులో అటు ఆటగాళ్ల పేర్లు కాస్త వింతగానే ఉన్నాయి అని చెప్పాలి.  అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరి పేర్లు పలకడానికి వ్యాఖ్యాతలు ఎన్ని అవస్థలు పడాలో అని నేటిజన్స్ ఈ విషయం తెలిసి నవ్వుకుంటున్నారు.

జపాన్ జాతీయ క్రికెట్ జట్టు వివరాలు చూసుకుంటే..

కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), ర్యాన్ డ్రేక్, కజుమా కటో-స్టాఫోర్డ్, షోగో కిమురా, కౌహీ కుబోటా, వటారు మియౌచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్, డెక్లాన్ సుజుకి-మెక్‌కాంబ్, మునీబ్ సిద్ధిక్ మియాన్, సుయోషి తకడ, ఇబ్రహీం తకాహషి, మకోటో తనియామా, యాష్లే తుర్గేట్, లచ్లాన్ యమమోటో-లేక్.

స్టాండ్ బై ప్లేయర్స్: కెంటో ఓటా-డోబెల్, మార్కస్ తుర్గేట్, జున్ యమషిత.

 ఆసియా గేమ్స్ లో పాల్గొనబోయే  14 జట్లు ఏవంటే..?

ఐసీసీ ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు స్థానాల కోసం నేపాల్, మంగోలియా, జపాన్, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, మాల్దీవ్స్, హాంకాంగ్, జపాన్‌లు లీగ్ స్టేజ్ లో తలపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: