ఆసియా కప్ ఫైనల్లో తన ప్రదర్శనపై.. సిరాజ్ ఏమన్నాడో తెలుసా?
ఇక ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ఇక ఆసియా కప్ లో భాగంగా మొదటి నుంచి కూడా మంచి ప్రదర్శన చేస్తూ వస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో అయితే శ్రీలంక ఓటమిని శాసించాడు మహమ్మద్ సిరాజ్. ఈ మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఇంత మంచి ప్రదర్శన చేసిన తర్వాత మాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకుండా ఎలా ఉంటారు.
సిరాజ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అయితే ఇక ఫైనల్ మ్యాచ్లో తన ప్రదర్శన గురించి ఈ హైదరాబాది బౌలర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బ్లూ జెర్సీ ధరించడం కంటే గొప్ప గౌరవం ఏదీ లేదు అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఓకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసాడు మొత్తంగా ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో తన ప్రదర్శన గురించి సిరాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్లూ జెర్సీ ధరించడం ఒక పెద్ద గౌరవం ఇవాల్టి ప్రదర్శన మరింత కష్టపడి ఆడేందుకు పూర్తిగా నిలుస్తాయి. గంటలు కొద్ది సాధన కృషికి తగ్గిన ప్రతిఫలం చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాల్టి ప్రదర్శన మరింత కష్టపడి ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేను సాధించాల్సినది ఇంకా చాలా ఉంది. నా ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న. మీ అందరి ప్రేమ మద్దతు దక్కాలి అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.