ఫైనల్ లో విజయమే కాదు.. ఒకప్పటి ఓటమికి ప్రతీకారం కూడా?
అయితే శ్రీలంక కూడా పటిష్టమైన టీం కావడం.. ఇక శ్రీలంకకు సొంత గడ్డమీద జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇక ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా కంటే శ్రీలంకనే ఫేవరెట్ గా బరిలోకి దిగింది అని చెప్పాలి. కానీ ఊహించని రీతిలో అటు భారత జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది . ఈ క్రమంలోనే శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చెల్లయించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం దెబ్బకు కేవలం 50 పరుగులు మాత్రమే చేసి శ్రీలంక బ్యాట్స్మెన్లు అందరూ కూడా చాప చుట్టేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో భాగంగా ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది టీమిండియా ఇక ఆ తర్వాత 50 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఎంతో అలవోకగా 6 ఓవర్లలోనే చేదించింది.
అయితే ఈ విజయంతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టడమే కాదు ఒకప్పటి దారుణమైన ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకుంది అని చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఒక జట్టుకి ఇటీవల శ్రీలంక చేసిన స్కోరే అత్తి తక్కువ స్కోరు కావడం గమానార్హం. అయితే 2000 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ ఇలాగే పరాభవాన్ని చూసింది. శ్రీలంక 2009 పరుగులు చేయగా భారత్ 26.3 ఓవర్లలో 54 పరుగులకే పరిమితం అయింది. అప్పుడు శ్రీలంక భారత్ పై విజయం సాధించగా ఇక ఇప్పుడు అదే ఓటమికి రివేంజ్ తీర్చుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఆసియా కప్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.