పాక్ జట్టుకు లైన్ క్లియర్.. నేరుగా హైదరాబాద్ కే?
అయితే భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా అటు వరల్డ్ కప్ లో ఆడాల్సి ఉంది. కానీ ఇక పాకిస్తాన్ వరల్డ్ కప్ లో ఆడుతుందో లేదో అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. అదే సమయంలో పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ లో భారత్ పాల్గొనకుండా తటస్థ వేదికను డిమాండ్ చేసింది. దీంతో ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ జట్టును భారత్ వెళ్లేందుకు అనుమతిస్తుందో లేదో అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.
అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ జట్టు వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అనుమతించగా.. అటు భారత ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ జట్టుకు వీసా జారీ చేయలేదు దీంతో ఇది కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో భారత ప్రభుత్వం నుంచి పాకిస్తాన్ జట్టుకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని అందరూ ఊహించారు. అయితే ఎట్టకేలకు భారత ప్రభుత్వం అటు పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు పూర్తిగా లైన్ క్లియర్ అయింది అని చెప్పాలి.
వరల్డ్ కప్ కోసం ఎంపికైన జట్టులోని సభ్యులందరికీ కూడా వీసాలు మంజూరు అయ్యాయి అని చెప్పాలి. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ 39 మంది సభ్యులు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బృందానికి వీసాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ఇండియాలో అడుగుపెట్టబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్లో ప్రారంభం కావటానికి ముందే ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ చేరుకోబోతోంది పాకిస్తాన్ జట్టు. అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతుంది పాకిస్తాన్. 29వ తేదీన న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ జరగబోతుంది.