అలాంటి పిచ్ లపై ఎవరైనా వికెట్లు తీస్తారు.. అశ్విన్ పై మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అంతేకాదు ఎంతో తెలివైన బౌలర్ గా కూడా అతనికి పేరు ఉంది. ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు అని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. కేవలం భారత గడ్డపై మాత్రమే కాదు విదేశీ పర్యటనల్లో కూడా అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి అశ్విన్ గురించి భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 భారత గడ్డమీద అశ్విన్ కోసమే ప్రత్యేకంగా స్పిన్ కు అనుకూలించే పిచ్ లు తయారు చేయిస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అతడి పప్పులు ఉడకవు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. తనను ఐసీసీ కామెంట్రీ ప్యానల్ లోకి తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ కామెంట్రీ ప్యానల్ లో సరైన స్పిన్నర్ ఒక్కరికి చోటు దక్కలేదు. కేవలం బ్యాట్స్మెన్లు.. శ్వేత జాతీయలకు మాత్రమే గేమ్ గురించి తెలుసా.. ఇది విచారకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


 టీమిండియా బ్యాటర్లు ముఖ్యంగా విరాట్ కోహ్లీ స్పిన్ను ఎదుర్కోవడం లో ఇబ్బంది పడతాడు. ఇంకా నయం  మనోళ్లు చివరి నిమిషంలో అశ్విన్ ను తీసుకున్నారు. ఎందుకంటే వికెట్లు పడినా అతను బ్యాటింగ్లో రాణించగలడు. అది కూడా పిచ్ లు ఫ్లాట్ గా ఉంటేనే. ఇందుకు బదులుగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ల పిచ్చులు అశ్విన్ కోసమే తయారు చేస్తారు. కాబట్టి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అశ్విన్ రికార్డులను ఎప్పుడైనా గమనించారా అంటూ శివరామకృష్ణన్ ప్రశ్నించాడు. అశ్విన్ మోస్ట్ అన్ఫిట్ క్రికెటర్. ప్రతి దానికి ఒక సాకు వెతుక్కుంటాడు. అయితే అతను చేసిన వ్యాఖ్యలతో షాక్ అవుతున్నారు నేటిజన్స్. మీ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: