ఇంకా ఒక్కరోజులో వరల్డ్ కప్.. కానీ ఉప్పల్ మైదానం పరిస్థితి ఇది?
అయితే ఇలా హైదరాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్లలో అటు భారత్ ఆడబోయే మ్యాచ్ లేకపోయినా పాకిస్తాన్ నెదర్లాండ్స్, శ్రీలంక జట్లతో తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఉప్పల్ మైదానం వేదికగా రెండు వారం మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆతిథ్యం ఇచ్చే అన్ని మైదానాల కోసం బిసిసిఐ భారీ స్థాయిలో డబ్బులు కేటాయించింది అయితే ఉప్పల్ మైదానంలో కూడా మరమ్మతులు చేశారు. స్టేడియం పైకప్పులు రిపేర్ చేయడంతో పాటు కొత్త సీట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇంకా ఒక్కరోజులో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు అన్నది తెలుస్తుంది.
అక్టోబర్ ఆరవ తేదీన ఉప్పల్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే మరమ్మత్తు పనులు మాత్రం ఇప్పటికి పూర్తి కాలేదు అని చెప్పాలి. కనీసం కుర్చీలు వేయటం కూడా పూర్తి కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో వారం మ్యాచ్ కి ఫ్యాన్స్ ని అనుమతించారు. ఈ క్రమంలోనే హెచ్సీఏ నిర్వాకం బట్టలు అయింది పాత సీట్లను అలాగే వదిలేసిన అధికారులు కనీసం వాటిని శుభ్రం కూడా చేయించలేదు. దీంతో సీట్లన్నీ కాకి రెట్టలతో దారుణంగా ఉన్నాయి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.