ఆ తెలుగు తేజం.. నిజమైన టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్?
ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతోమంది తెలుగు యంగ్ ప్లేయర్స్ సైతం సత్తా చాటుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మన ప్రతిభతో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సైతం టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అనే ప్రతి ఒక్కరులో కూడా నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ కుర్రాడు.. ఇక ఇప్పుడు టీమిండియాలో కూడా తన స్థానాన్ని త్వరలోనే సుస్థిరం చేసుకోబోతున్నాడు అన్నది తెలుస్తోంది.
కాకా తెలుగు తేజం తిలక్ వర్మ ఫ్యూచర్ ఇండియా స్టార్ అని అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 231 పరుగులు చేసిన తిలక్ వర్మ.. 38.5 యావరేజ్ 142.6 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇక తిలక్ వర్మ తన రెండవ మ్యాచ్ లోనే తొలి ఆర్థ సెంచరీ చేసి భారత్ తరపున 50 పరుగులు చేసిన రెండవ పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక ఇటీవల ఏషియన్ గేమ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 50 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇలా తిలక్ వర్మ నిలకడైన ప్రదర్శనకు చిరునామాగా మారిపోయాడు.