గిల్ దూరమైతే.. మొదటి మ్యాచ్ లో ఓపెనర్ ఎవరో తెలుసా?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ఈనెల 5వ తేదీన గ్రాండ్ గా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 10 టీమ్స్ ఈ వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. కాగా భారత జట్టు ఈనెల 8వ తేదీన ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఆడబోతుంది. అయితే తొలి మ్యాచ్లో తప్పక విజయం సాధిస్తుంది అని భారత అభిమానులు అందరూ కూడా గట్టిగా నమ్మకం పెట్టుకున్న సమయంలో టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.


 ఏకంగా భారత జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. డెంగ్యూ పాజిటివ్గా తేలిందట. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈనెల 8వ తేదీన జరగబోయే మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.అయితే గత కొంతకాలం నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న గిల్ ఇక ఇప్పుడు టీమిండియాలో ఉండడం ఎంతో కీలకం. అతను ఏ కారణంతోనైనా భారత జట్టుకు దూరమయ్యాడు అంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం గ్రిల్ డెంగీ తో బాధపడుతున్న నేపథ్యంలో ఒకవేళ అతను ఇక టీమ్ ఇండియా ఆడబోయే మొదటి మ్యాచ్ కు దూరమైతే ఇక అతని స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగిపోయే ఆటగాడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది   అయితే గిల్ ఇక అనారోగ్యంతో దూరమైతే ఇక అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా  బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయట. అయితే దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కి కూడా మంచి రికార్డులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గిల్ డెంగీ బారిన పడటంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు  అతను త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: