ఈసారి సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. కాశి జ్యోతిష్యుడి జోస్యం?
ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే కొంతమంది జ్యోతిష్యులు కూడా ఈ వన్డే వరల్డ్ కప్ లో విజేత ఎవరు సెమి ఫైనల్ కు వెళ్లబోయే టీమ్స్ ఏవి అన్న విషయాన్ని కాశీకి చెందిన ఒక జ్యోతిష్యుడు సైతం గ్రహాల కదలికలు నక్షత్ర రాశుల ఆధారంగా వన్డే వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ చేరి నాలుగు జట్ల గురించి జోష్యం చెప్పారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు టాప్ ఫోర్ లో ఉంటాయి అంటూ పండిట్ సంజయ్ ఉపాధ్యయ్ తెలిపారు. ఈ నాలుగు జట్ల మధ్య సెమీఫైనల్ ఫైట్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
బృహస్పతి అంగారకుడి మేశంలో.. శని గ్రహం దాని అసలు త్రిభుజం కుంభంలో కూర్చున్నాయని కాబట్టి భారత్ సెమీఫైనల్ గెలవడమే కాకుండా ఫైనల్ కు కూడా వెళ్తుందని సంజయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిందని ఆ సమయంలో బృహస్పతి అంగారకుడి రాశి చక్రంలో ఉన్నాడని చెప్పుకొచ్చారు ఆయన. కుజుడు ఆట యొక్క గ్రహం కాబట్టి బృహస్పతి అంగారకుడి రాశిలో ఉన్నప్పుడల్లా అది విజయాన్ని ఇస్తుందని సంజయ్ చెబుతున్నారు. ఈసారి కూడా ఇంగ్లాండ్ అదే పరిస్థితి ఉండడంతో ఇంగ్లాండు కూడా సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.