రోహిత్ మరో 3 సిక్సర్లు కొట్టాడంటే.. ప్రపంచ రికార్డు బద్దలవుతుంది?
ఇక రోహిత్ శర్మ సారధ్యంలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా ఘనవిజయాన్ని అందుకుంది టీం ఇండియా. బ్యాటింగ్ విభాగం మొదట్లో తడబడినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకొని పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయ డంకా మోగించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్గా వెను తిరగడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా తర్వాత జరగబోయే మ్యాచ్లో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే చాలు అని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన యాక్టివ్ ప్లేయర్గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో క్రిస్కేల్ 553 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ 551 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఆఫ్రిది 476 సిక్సర్లు, మేకళ్ళమ్ 398, మార్టిన్ గాప్తిల్ 383 సిక్సర్లతో తొలి 5 స్థానాలలో ఉన్నారు. రోహిత్ మరో మూడు సిక్సర్లు కొడితే ఏకంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చేస్తాడు.