ఒక్క సెంచరీతో.. రోహిత్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా?
అయితే ఇటీవల వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలబడింది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయి నిరాశపరిచాడు అని చెప్పాలి. దీంతో అభిమానులందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇటీవలే రెండో మ్యాచ్లో మాత్రం రోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శన చేసి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో కదం తొక్కాడు అని చెప్పాలి. 63 బంతుల్లోనే ఏకంగా సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా ఏకంగా 131 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు (7) సాధించిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (556) కొట్టిన ప్లేయర్గా నిలిచి క్రిస్ గేల్ వెనక్కి నేట్టేసాడు. ఇక భారత తరఫున వన్డే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ 63 బంతుల్లో 100 పరుగులు చేసిన ప్లేయర్ గా మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ హిస్టరీలో తక్కువ ఇన్నింగ్స్ లు (19) లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రేయర్ గా నిలిచాడు. వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు (31) చేసిన బ్యాట్స్మెన్ లలో మూడవ స్థానంలో నిలిచాడు.