పాక్ తో మ్యాచ్.. గిల్ ఆడతాడా లేదా?
ఈ క్రమంలోనే భారత జట్టు అంచనాలకు మించి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌లలో కూడా ఘనవిజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియా తో తలబడిన భారత జట్టు.. విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లోను ఎంతో అలవోకగా విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది టీమిండియా. అయితే ఈనెల 14వ తేదీన పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.
ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరుకోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఓపెనర్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. అయితే ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇదే ప్రశ్నపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ ను ముందు జాగ్రత్తగానే ఆస్పత్రిలో చేర్చామని.. ఇక వైద్య బృందం అతని పర్యవేక్షిస్తుందని.. 70 నుంచి 80% అతను కోలుకున్నాడని చెప్పుకొచ్చాడు విక్రం రాథోడ్. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అని ఇప్పుడే చెప్పలేం అంటూ చెప్పుకొచ్చాడు.