గిల్ పాకిస్తాన్ తో మ్యాచ్లో ఆడతాడా.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. 2011లో చివరిసారిగా టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది అని చెప్పాలి. అప్పుడు స్వదేశంలో జరిగిన వరల్డ్కప్ లోనే టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మళ్లీ భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీలో ఈసారి తప్పకుండా టీమిండియా  విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు.

 అనుకున్నట్లుగానే ఇక అద్భుతమైన ప్రదర్శన చేస్తూ విజయవంతమైన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది టీం ఇండియా. కానీ భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది. మొన్నటి వరకు కీలక ఆటగాళ్లు గాయం బారినప్పటి జట్టుకు దూరమైతే ఇటీవలే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే భారత కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న ఓపెనర్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. అతను వరల్డ్ కప్ లో భాగంగా ఆడిన మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇక వైద్యుల పర్యవేక్షణలో కోల్పోయిన అతను ఇటీవల ప్రాక్టీస్ చేశాడు. దీంతో నేడు పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో అతను అందుబాటులోకి వస్తాడా లేదా అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

 ఇదే విషయం గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జరగబోయే మ్యాచ్ కి యంగ్ ప్లేయర్ గిల్ 99 శాతం అందుబాటులో ఉంటాడని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు  గిల్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోరుకున్నాడని తెలిపారు. రోహిత్ శర్మ వ్యాఖ్యలతో అటు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవల గిల్ డెంగ్యూ బారిన పడి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా నేడు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: