రోహిత్ సంపూర్ణమైన ప్లేయర్.. చాలా షాట్స్ ఉన్నాయ్ : అక్తర్

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఒక బ్యాట్స్మెన్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఆ ప్లేయర్ ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సాధారణం గానే రోహిత్ శర్మ వరల్డ్ కప్ లు అంటే చాలు ఏకంగా సెంచరీలు కొట్టాలనే కంకణం కట్టుకొని వచ్చాడేమో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే 2019 వన్డే వరల్డ్ కప్ లో ఏకంగా ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు సాధించి సంచలనమే సృష్టించాడు రోహిత్ శర్మ.


 ఇక ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇలా సెంచరీలు చేయడమే లక్ష్యం గా రోహిత్ పెట్టుకున్నాడు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమం లోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇక డకౌట్ గా  వెను తిరికినప్పటికీ.. ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా 131 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను ప్రత్యర్థి  బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు. ఏకంగా 86 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 రోహిత్ బ్యాటింగ్ ప్రదర్శన చూసిన తర్వాత భారత మాజీ ఆటగాళ్ల దగ్గర నుంచి ప్రత్యర్థి ఆటగాళ్ల వరకు కూడా అందరూ ప్రశంసలు కురిపించకుండా  ఉండలేకపోతున్నారు. కాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్  షోయబ్ అక్తర్ సైతం రోహిత్ బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్. అతని దగ్గర ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి  పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వన్ మ్యాన్ ఆర్మీల ఆడాడు. రోహిత్ సంపూర్ణమైన ప్లేయర్. జట్టు సభ్యులందరూ కూడా అతనిపై నమ్మకం ఉంచుతారు అంటూ ప్రశంసలు కురిపించాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: