బాబర్, రిజ్వాన్.. ఇద్దరు పిరికిపందలే : పాక్ మాజీ
అయితే పాకిస్తాన్ లాంటి జట్టు భారత్ తో జరిగిన మ్యాచ్లో చేసిన ప్రదర్శన మాత్రం ఆ దేశ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అంతేకాదు భారత్ చేతిలో ఘోర పరాభవాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ పాకిస్తాన్ జట్టు ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు అయినా బాబర్ రిజ్వాన్లు పిరికిపందలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రషీద్ లతీఫ్.
పాకిస్తాన్ జట్టులో ఒక్క బ్యాట్స్మెన్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఆడలేకపోయారు. ముఖ్యంగా బాబర్, మహమ్మద్ రిజ్వాన్ అతిగా స్వీప్ ఆడెందుకు ప్రయత్నించారు. క్రికెట్లో ధైర్యం లేని వారే గిలా స్వీప్ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే వీరు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు వ్యక్తిగత స్కోర్ కి ప్రాధాన్యమిచ్చారు. కానీ ఈ జట్టు ప్రయోజనాల కోసం ఆడినట్లు ఎక్కడ కనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ స్పిన్ ఆడే విధానాన్ని చూస్తే ఇద్దరు ఎంతో చక్కగా స్పిన్ ఎదుర్కొంటారు. మా వాళ్ళు పిరికివాళ్ళు అందుకే బాగా అడలేకపోయారు అంటూ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు.