ఎంత పని చేసావయ్యా.. సొంత జట్టునే ఓడించావుగా?
ప్రపంచ కప్ హిస్టరీలో ఐదు సార్లు ఛాంపియన్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టును ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ఎంత దారుణంగా ఓడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 69 పరుగుల తేడాతో బట్లర్ సేన దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే మొదటిసారి ఇంగ్లాండ్ పై విజయం సాధించిన ఆఫ్గనిస్తాన్ చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే ఆఫ్గనిస్తాన్ విజయం వెనక ఒక మాజీ ఆటగాడి మాస్టర్ మైండ్ హస్తం ఉంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆటగాడు ఎవరో కాదు గతంలో ఇంగ్లాండ్ తరఫున జాతీయ జట్టుకు ఆడిన ఆటగాడు. అతనే ఆఫ్ఘనిస్తాన్ టీం హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్.
ఇంగ్లాండ్ తో మ్యాచ్కి ముందు మీడియా సమావేశంలో మాట్లాడాడు జొనాథన్ ట్రాట్. ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా మా జట్టుకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అయితే కోచ్ మాటలను నిలబెడుతూ ఆఫ్గనిస్తాన్ జట్టు పటిష్టమైన ఇంగ్లాండునే ఓడించి.. తమ సత్తా ఏంటో చూపించింది. అయితే ఇంగ్లాండ్ ను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాడు జొనాథన్ ట్రాట్. కోచ్ నిర్ణయాలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు విజయం సాధించారు. చివరికి ఇంగ్లాండు లాంటి జట్టును ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు.
కాగా ఇంగ్లండ్ తరఫున 68 వన్డేలు ఆడిన జోనాథన్ ట్రాట్ మొత్తం 2819 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 52 టెస్టు మ్యాచ్లు ఆడిన ట్రాట్ మొత్తం 3835 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు, 9 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి