సెంచరీ కాదు.. 35 రన్స్ వద్దే.. కోహ్లీ అరుదైన రికార్డ్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా భారత మాజీ కెప్టెన్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీని ఎందుకో ఇలా రికార్డుల కింగ్ అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకుంటారు అని అంటే మాత్రం.. ఈ విషయాన్ని అతను సాధించిన రికార్డులే చెప్పకనే చెబుతూ ఉంటాయ్. ఇప్పటివరకు ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టేశాడు విరాట్ కోహ్లీ. ఇక మంచి నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ ఈ తరానికి తనను మించిన క్రికెటర్ ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని నిరూపించాడు.


 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ అదరగొడుతూ ఉంటాడు కోహ్లీ. అయితే మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ.. మళ్ళీ సెంచరీల వేట ప్రారంభించాడు. ఇక చాన్స్ దొరికితే చాలు సెంచరీ చేసేస్తూ ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొడుతూ తన పేరును లికించుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం కాదు.. కేవలం 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25957 పరుగులు సాధించి శ్రీలంక క్రికెట్ లెజెండ్ అయినా జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టి అతని వెనక్కి నెట్టాడు. జయవర్తనే 725 ఇన్నింగ్స్ లలో 25957 పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కేవలం 567 ఇన్నింగ్స్ లోనే 25 వేల 960 పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో టాప్లో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో ఉన్నాడు. కుమార సంగకర 28016 పరుగులు, రికీ పాంటింగ్ 27,468 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: