బన్నీని వదలని డేవిడ్ వార్నర్.. ఏం చేశాడో చూడండి?
దీనికి అంతటికి కారణం అతను భారత్ పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానమే అని చెప్పాలి. గతంలో లాక్డౌన్ సమయంలో ఎంతో మంది భారత హీరోలకు సంబంధించిన సినిమాల పాటలపై డాన్సులు చేసి ప్రేక్షకులను అలరించిన డేవిడ్ వార్నర్.. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అంతేకాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఊపేసిన పుష్ప సినిమాలోని పాటలపై కూడా ఎప్పుడూ డాన్సులు చేస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో భాగంగా ఒక మ్యాచ్ లో శ్రీవల్లి పాటపై అల్లు అర్జున్ చేసిన స్టెప్ చేసి అలరించిన డేవిడ్ వార్నర్.. ఇటీవల సెంచరీ చేసిన సమయంలోను చేసుకున్న సెలబ్రేషన్స్ భారతీయులందరిని ఫిదా చేసేస్తున్నాయి.
ఇటీవల జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు వార్నర్. ఏకంగా 163 పరుగులు చేశాడు. అయితే సెంచరీ అనంతరం డేవిడ్ వార్నర్ ఆసక్తికర సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆనందంతో ఎగిరి గంతేసిన డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ మేనరిజం అయిన తగ్గేదేలే మేనరిజాన్ని చేసి సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా చిన్న స్వామి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన ఇండియన్స్.. బాయ్ నువ్వు ఇండియా వచ్చేసేయ్.. ఇక్కడ ఆధార్ కార్డు తీసుకో అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.