చరిత్ర సృష్టించిన రోహిత్.. 20 ఏళ్ళ తర్వాత అలాంటి విజయం?

praveen
భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ వున్నాడు అనే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే తన కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు వరుసవిజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీ వ్యూహాలపై  అటు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక మొదటిసారి వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ టీమిండియా కు కెప్టెన్సీ వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.


 దీంతో రోహిత్ సారధ్యంలో తప్పకుండా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీంతో వరల్డ్ కప్ టీమ్ ఇండియా తప్పక గెలుస్తుంది అని నమ్మకాన్ని కలిగించే విధంగానే భారత జట్టు ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. రోహిత్ సారాధ్యంలో వరుస విజయాలు సాధిస్తూ ఉంది టీమిండియా. అయితే ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ సమయంలో.. మాత్రం భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఎందుకంటే గత రికార్డులు చూసుకుంటే భారత్ పై న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.


 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ భారత్ జట్లు 13 సార్లు తలబడితే.. 10 సార్లు న్యూజిలాండ్ విజయం సాధిస్తే కేవలం మూడుసార్లు మాత్రమే భారత్ గెలిచింది. అయితే ఇక ఇప్పుడు ఓటమి ఎరుగని జట్లుగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏం జరుగుతుందో అని అందరూ ఆందోళన చెందారు. అయితే  చివరికి టీమిండియా అనే విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ను ఓడించిన భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. 2003 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై చివరిసారిగా భారత్ గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన 2007, 2011, 2015, 2019 ప్రపంచ కప్ లో భారత్ ను కివీస్ ఓడిస్తూనే ఉంది. కాగా న్యూజిలాండ్ వరుస విజయాలకు రోహిత్ సేన 20 ఏళ్ల తర్వాత బ్రేక్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: