సిక్సర్లు కొట్టడంలో.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ?
ఈ క్రమంలోనే ఇలా సిక్సర్లు కొట్టడం విషయంలో రోహిత్ శర్మ భారత ఆటగాళ్లను మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో ఉన్న స్టార్లను సైతం వెనక్కి నెట్టి అరుదైన రికార్డులు సృష్టించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు సిక్సర్లు కొట్టడంలో మరో అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.
ఒకరకంగా చెప్పాలంటే సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒకే ఏడాదిలో 50కి పైగా సిక్సర్లు బాదిన తొలి ఏషియన్ ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. అయితే ఓవరాల్ గా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబి డిబిలియర్స్ 58 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత స్థానంలో క్రిస్కేల్ 56, రోహిత్ శర్మ 51 సిక్సర్లతో ఉన్నారు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మ్యాచ్లు ఆడుతుంది. ఇక రోహిత్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఇక ఏ బి డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టి రోహిత్ టాప్ లోకి రావడం ఖాయమని అభిమానులు కూడా భావిస్తున్నారు.