ఛేజింగ్ లో.. కోహ్లీ ని మించిన తోపు లేడు : వాట్సాన్

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్నప్పుడు.. మొదట ఇన్నింగ్స్ ఆడే టీం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో ఈజీగా బ్యాటింగ్ చేయగలుగుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఛేజింగ్ చేసే జట్టుపై మాత్రం తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముందు కొండంత లక్ష్యం ఉన్నప్పుడు మరోవైపు నుంచి ప్రత్యర్థి బౌలర్లు వైవిద్యమైన బంతులు సంధిస్తున్న సమయంలో జట్టులోని ప్లేయర్స్ అందరూ కూడా ఇక ఆ బ్యాట్స్ మెన్ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు.. ఒత్తిడి తీవ్రతరం అవుతూ ఉంటుంది


 ఒకవైపు వికెట్ను కాపాడుకుంటూనే మరోవైపు ఇక జట్టును గెలిపించేందుకు భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే చేజింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఒత్తిడికి ఎంతోమంది వికెట్ కోల్పోతూ ఉంటారు  కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం చేజింగ్లో తమకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటారు. అలాంటి ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు అని చెప్పాలి. అందరూ చేజింగ్ ఒత్తిడి అని చెబుతుంటే.. తనకు మాత్రం ఛేజింగ్ ఇష్టం అని చెబుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఛేజింగ్ ఉంది అంటే చాలు మరింత దూకుడుగా ఆడుతూ భారీగా స్కోర్ నమోదు చేయడం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షైన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఛేజింగ్ చాలా కష్టమని అందరూ అనుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం దాన్ని సులభతరం చేస్తాడు అంటూ షేన్ వాట్సన్ తెలిపాడు. ఇదే పనిని అతను కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాడు అంటూ ప్రశంసించాడు. అయితే కోహ్లీ చాలా గొప్పగా ఆటను అర్థం చేసుకుంటాడని.. అతను ఒక ఇంటర్నల్ కంప్యూటర్ అని పేర్కొన్నాడు వాట్సన్. ఇక విరాట్ ఆట అందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ చేజింగ్ సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఏకంగా 95 పరుగులు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: