ఆస్ట్రేలియా భారీ విజయం.. పాత సెంటిమెంట్ రిపీట్?
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని స్టేడియాలలో ఇక పిచ్ విషయంలో కొన్ని సెంటిమెంట్లు కూడా కొనసాగుతూ ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తప్పక విజయం సాధించడం.. లేదంటే చేజింగ్ చేసిన జట్టు విక్టరీ సొంతం చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ ఉంది అని చెప్పాలి. వన్డే ఫార్మాట్లో ఈ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా మొదట బ్యాటింగ్ చేసిన చెట్టు గెలుస్తుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది అని చెప్పాలి. 2013 నుంచి ఈ స్టేడియంలో 9 వన్డే మ్యాచ్లు జరగగా.. ఏడు మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయ్.
గతంలో భారత్ సౌత్ ఆఫ్రికా ఆఫ్గనిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రమే ఇది సాధ్యం కాలేదు. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన నెదర్లాండ్స్ కేవలం 90 పరుగులకే పరిమితమైంది. దీంతో 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్ హిస్టరీలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా.