డ్రెస్సింగ్ రూమ్ లో.. బాబర్ గుక్క పెట్టి ఏడ్చాడు : పాక్ మాజీ
ఇకపోతే ఇది ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఒక దారుణమైన ఓటమిన్ చవిచూసింది పాకిస్తాన్ జట్టు టైటిల్ ఫేవరెట్ అయిన పాకిస్తాన్ జట్టు పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు వరకు వరల్డ్ కప్ హిస్టరీలో ఎన్నోసార్లు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కానీ మొదటిసారి ఇక ఈ పసికూన టీం చేతిలో పరాజయం పాలయింది అని చెప్పాలి. అది కూడా ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ దేశ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆఫ్గనిస్తాన్తో ఓటమిని అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ జీర్ణించు కోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ వ్యాఖ్యానించాడు మ్యాచ్ అనంతరం హోటల్కు వెళ్ళిన తర్వాత చాలాసేపు ఏడ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఓటమికి అతను ఒక్కడే బాధ్యుడు కాదు జట్టు లోని సభ్యులందరూ కూడా బాధ్యులే. మేమంతా అతనికి అండగానే ఉంటాం. పాకిస్తాన్ దేశం మొత్తం అతనికి మద్దతు గానే నిలుస్తుంది అంటూ మాజీ ప్లేయర్ మహమ్మద్ యూసుఫ్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఐదు మ్యాచ్లు అడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది.