ఇంగ్లాండుకు మరో ఓటమి.. ఎక్కడో తేడా కొడుతుంది అంటున్న మైకల్ వాన్?
కానీ ఊహించని రీతిలో ఇంగ్లాండ్ ప్రదర్శన విషయంలో అందరి అంచనాలు కూడా తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిపోవడమే పనిగా పెట్టుకుంది ఇంగ్లాండ్ జట్టు. పటిష్టమైన టీమ్స్ చేతిలోనే కాదు పసికూన జట్ల చేతిలో కూడా ఓడిపోతూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లకంటే.. దారుణమైన ప్రదర్శన చేస్తుంది. ఇక ఇటీవల శ్రీలంక చేతిలో కూడా ఎనిమిది వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది ఇంగ్లాండు జట్టు.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు వరుస ఓటములపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకల్ వాన్ స్పందిస్తూ సెటైర్లు వేశాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ అనే కొత్త పోకడను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేసింది అయితే బజ్బాల్ క్రికెట్ అంటూ గొప్పలకు పోయి ప్రస్తుతం చిన్న జట్లపై కూడా ఓడిపోయి బొక్క బోర్ల పడింది. అయితే ఇదే విషయంపై మైకల్ వాన్ మాట్లాడుతూ.. ఎక్కడో తేడా కొడుతోంది. ఇంగ్లాండు ఇంత ఘోరంగా ఏ వరల్డ్ కప్ లోను ఆడలేదు. టోర్నీ లో ఉన్న అన్ని జట్లు కూడా ఇంగ్లాండును ఓడిస్తున్నాయి. ఇక భారత్ చేతిలో ఓడిపోవడమే తరువాయి. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి అంటూ ప్రస్తుతం ఇంగ్లాండ్ పరిస్థితిపై మైఖేల్ వాన్ విచారం వ్యక్తం చేశాడు.