వన్డే ఫార్మాట్లో.. ఫాస్టెస్ట్ సెంచరీల వీరులు వీళ్ళే?

praveen
ప్రస్తుతం భారత్ వేదిక జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పరుగుల ప్రవాహం కొనసాగుతోంది అని చెప్పాలి. కొన్ని జట్లు చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంటే.. మరికొన్ని టీమ్స్ మాత్రం సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే చాలామంది ఆటగాళ్ళు తమ ఫామ్ నిరూపించుకుంటూ ఎంతో అలవోకగా సెంచరీలు చేసేస్తూ ఉన్నారు. దీంతో ఈ వరల్డ్ కప్ లో భాగంగా దాదాపు అన్ని టీమ్స్ ఆటగాళ్లు కూడా సెంచరీలు చేశారు చెప్పాలి. చివరికి పసికూన టీమ్స్ కి చెందిన ఆటగాళ్ళు సైతం ఇలా సెంచరీ రికార్డులను అందుకున్నారు.


 అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా నెదర్లాండ్స్  మధ్య జరిగిన మ్యాచ్లో చారిత్రాత్మక విక్టరీ నమోదయింది అన్న విషయం తెలిసిందే. పసికూన నెదర్లాండ్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన పటిష్టమైన ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో పాటు ఆల్రౌండర్ మాక్స్వెల్ సైతం సెంచరీ తో చెలరేగిపోయారు. అయితే మ్యాక్స్వెల్ అయితే తన బ్యాటింగ్తో విధ్వంశాన్ని సృష్టించాడు అని చెప్పాలి. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. వరల్డ్ కప్ హిస్టరీలో పాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ లిస్టులో దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబి డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. 31 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ కోరే అండర్సన్ 36 బంతుల్లో, పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది 37 బంతుల్లో, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్  మాక్స్ వెల్ 40 బంతుల్లో, యూఏఈ ప్లేయర్ ఆసిఫ్ ఖాన్ 41, వెస్టిండీస్ ప్లేయర్ బ్రియాన్ లారా 45, ఇంగ్లాండ్ ప్లేయర్ బట్లర్ 46, శ్రీలంక ప్లేయర్ జయసూర్య 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకోగా విరాట్ కోహ్లీ 52 బంతుల్లో సెంచరీ సాధించిన ప్లేయర్గా ఈ లిస్టులో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: