బాబర్ కి కెప్టెన్సీ చేయడం రాదు.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?
ఇక ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీలో వరుసగా నాలుగు పరాజయాలను మూట గట్టుకుని ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన పోరులో గెలిచే మ్యాచ్లో సైతం ఓడిపోయి ఒక వికెట్ తేడాతో పరాజయం పాలయింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే ఆ జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ మాజీ లందరూ కూడా కెప్టెన్ బాబర్ టార్గెట్ చేస్తూ అతని కెప్టెన్సీ వ్యూహాలపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ విమర్శలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.
కాగా ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజాం కు కెప్టెన్సీ చేయడం రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత రెండు సంవత్సరాలుగా ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఉన్న బాబర్ కు మేనేజ్మెంట్ చెప్పిన విషయాలను వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అవ్వడమే సరిపోతుంది. ఇదే పాకిస్తాన్ జట్టు ఓటమికి కారణం. ఇక ఓటమికి బాబరే అసలైన కారణం. అతనికి జట్టును ఎలా ముందుకు నడిపించాలో తెలియదు. ఒత్తిడిలో బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు అంటూ డానీష్ కనేరియా వ్యాఖ్యానించాడు.