ఇంగ్లాండ్ ప్లేయర్లు దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండుకు ఉన్న సెమీఫైనల్ అవకాశాలు దాదాపు క్లోజ్ అయ్యాయి అని చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ టీమ్ సెమి ఫైనల్ చేరటం దాదాపు అసాధ్యమని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ టీం ప్రదర్శన పై ప్రస్తుత ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఇంగ్లాండ్ ప్రదర్శన పై విమర్శలు చేస్తున్న లిస్టులో.. భారత మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా చేరిపోయాడు ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ ఓటమికి బ్యాటింగ్ కారణమా బౌలింగ్ కారణమా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బౌలింగ్ బ్యాటింగ్ లో రెండిట్లో కూడా నిరాశపరిచింది. తొలి మ్యాచ్ నుంచే జట్టు నిరుత్సాహంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ అయితే మరింత దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్ లో ఒక్కరు కూడా బాధ్యతగా ఆడట్లేదు. జట్టులో చాలామంది ఆటగాళ్లు పరువు కోసం ఆడుతున్నారు తప్ప.. దేశం ఆడుతున్నట్లు కనిపించట్లేదు శ్రీలంక పై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుందని అనుకున్నారు. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. జోరుట్ అవుట్ అయిన తర్వాత అందరూ చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అందుకే వారు విజయం సాధించగలిగారు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.