ఇంతకంటే ఏం చెప్పగలను.. అర్థం చేసుకునే వాళ్ళకి ఒక్క సైగ చాలు : ధోని

praveen
భారత క్రికెట్ హిస్టరీలో.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిల్ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. 2007లో మొదటిసారి టి20 ఫార్మాట్లో ప్రవేశపెట్టిన వరల్డ్ కప్ను భారత జట్టు ముద్దాడింది కూడా అటు ధోని కెప్టెన్సీ లోనే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2011లో భారత జట్టుకు రెండో ప్రపంచ కప్ అందించాడు. మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో 2013లో మరోసారి ప్రతిష్టాత్మకమైన టైటిల్ అందించాడు. అయితే ధోని శకం ముగిసిన తర్వాత ఇప్పటివరకు టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోపీ కూడా గెలవలేదు.


 అయితే పదేళ్ల తర్వాత ప్రస్తుతం సొంత గడ్డ పైన వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా  అయితే 2011లో కూడా ఇలా సొంత గడ్డపై జరిగిన వరల్డ్కప్ లోనే భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని భారత అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు.. ఇక పాయింట్ల పట్టికలో టాప్ లోనే ఉంది. దీంతో ఈసారి రోహిత్ సేన తప్పకుండా కప్పు కొట్టడం ఖాయమని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఐసీసీ టైటిల్స్ ధీరుడు మాజీ కెప్టెన్ ధోని ఈ విషయంపై స్పందించాడు.


 ఈసారి టీమిండియా పటిష్టంగా కనిపిస్తుందని.. వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన మహేంద్రసింగ్ ధోని.. ఇంతకంటే నేనేం ఎక్కువ చెప్పగలను. అర్థం చేసుకునే వాళ్లకు ఒక్క సైగ చేసిన చాలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరు చూస్తే తప్పకుండా ట్రోఫీ ముద్దాడుతుంది అని చెప్పకనే చెప్పాడు ఈ లెజెండ్. దీంతో ధోనీ చెప్పాడు అంటే చాలు ఇక తప్పకుండా టీమిండియా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది. ఎందుకంటే ధోని అంచనా ఎప్పుడూ తప్పవ్వదు అంటూ అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: