వరల్డ్ కప్.. రోహిత్ సేనపై ధోని కీలక వ్యాఖ్యలు?
ఏకంగా టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్ధులు సైతం భయపడే విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే రోహిత్ సేన ఇలా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉండడం పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియా పై అటు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా అయితే ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. క్రికెట్లో లెజెండ్ అయినప్పటికీ క్రికెట్ విషయాలపై కూడా పెద్దగా స్పందించడు. తన పని తాను చూసుకుంటూ ఉంటాడు.
అలాంటి ధోని ఇప్పుడు టీమిండియా గురించి మాట్లాడాడు అనేసరికి అది హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఇటీవల బెంగళూరులోని ఒక ఈవెంట్లో పాల్గొన్న ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వరల్డ్కప్ ఆడుతున్న భారత జట్టు బాగుంది. అన్ని విభాగాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ కూడా గెలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక మనకు శుభం కలుగుతుంది అనే నమ్మకం ఉంది అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం భారత జట్టు సెమీఫైనల్ లో ఓడిపోవడం మాత్రం ఎంతగానో బాధ కలిగించింది అంటూ తెలిపాడు.