సంచలన విజయంతో.. చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్?

praveen
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లలో ఆడుతూ అతి కష్టం మీద ఇక వరల్డ్ కప్ అధికారిక మ్యాచ్లు ఆడేందుకు అర్హత సాధించింది పసికూన నెదర్లాండ్స్ జట్టు. ఏదో వరల్డ్ కప్ ఆడాలని కోరిక తీరింది. కానీ ఈ టీం పెద్దగా ఆశించదగ్గ ప్రదర్శన చేయలేదు అని అందరూ అనుకున్నారు. ఎలాగో పటిష్టమైన టీమ్స్ చేతిలో దారుణమైన ఓటమి చవిచూసి లీగ్ దశ నుంచి ఈ టీం నిష్క్రమిస్తుంది అని అందరూ అంచనా వేశారు. అయితే అనుకున్నట్లుగానే లీగ్ దశ నుంచి నెదర్లాండ్స్ నిష్క్రమించే లాగే ఉంది.


 ఎందుకంటే ఇప్పుడు వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నెదర్లాండ్స్ సాధించింది కేవలం రెండు విజయాలు మాత్రమే. కానీ ఈ రెండు కూడా ఈ చారిత్రాత్మక విజయాలు కావడం గమనార్హం. ఏకంగా మొన్నటికి మొన్న పటిష్టమైన సౌతాఫ్రికా పై ఘన విజయాన్ని అందుకున్న నెదర్లాండ్స్ జట్టు ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోను 87 పరుగుల తేడాతో విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇలా నెదర్లాండ్స్ సంచలన విజయాలకు ప్రస్తుత వరల్డ్ కప్ లో చిరునామాగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అరుదైన రికార్డును కూడా నెదర్లాండ్స్ టీం తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. మెగా టోర్నీలో టెస్ట్ సభ్యత్వం ఉన్న జట్టుపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన అసోసియేషన్ జట్టుగా నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.


 బంగ్లాదేశ్ పై 87 పరుగులు తేడాతో గెలుపొందడంతో ఇక ఈ ఘనత సాధించగలిగింది చిన్న టీం అయినా నెదర్లాండ్స్. కాగా టెస్టు హోదా లేని జట్టును అసోసియేట్ టీం గా పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలోనూ సౌత్ ఆఫ్రికా పై ఘనవిజయాన్ని అందుకుంది ఈ జట్టు. అయితే మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్  కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. దీంతో స్వల్ప టార్గెట్ ను బంగ్లాదేశ్ ఈజీగా చేదిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో నెదర్లాండ్స్ బౌలింగ్ దాటికి బంగ్లాదేశ్ కేవలం 149 పరుగులకే కుప్పకూలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: