పాకిస్తాన్ క్రికెటర్లకు.. ఐదు నెలలుగా జీతాలు కూడా లేవు : పాక్ మాజీ

praveen
వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టుపై ఏ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోతుంది. వరల్డ్ లోనే బెస్ట్ బౌలింగ్ విభాగం అని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో తేలిపోతున్నారు. దీంతో పటిష్టమైన టీమ్స్ చేతుల్లోనే కాదు చిన్న టీమ్స్ చేతుల్లో కూడా పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతుంది పాకిస్తాన్.


 చివరికి కెప్టెన్ బాబర్ అజాం సైతం అటు జట్టును ముందుకు నడిపించడంలోనే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా ఏమాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మరింత ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సమయంలో పార్క్పాక్ జట్టు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల పాక్ జట్టు పరిస్థితి గురించి ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు  ఏకంగా ఐదు నెలల నుంచి పాకిస్తాన్ క్రికెటర్లకు కనీసం జీతాలు కూడా అందట్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రషీద్ లతీఫ్. షాకింగ్ విషయాలను వెల్లడించాడు. జీతాల విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కి ప్రస్తుతం పాక్ జట్టు కెప్టెన్ గా ఉన్న బాబర్ మెసేజ్ చేసిన ఆయన స్పందించట్లేదు. ఇది నిజంగా చాలా దారుణం. బోర్డు నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆటగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం నిరాశలో ఉన్నారు అంటూ రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంతకాలం నుంచి పాకిస్తాన్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా జీవితాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. చివరికి ఆ ప్రభావం క్రికెటర్ల పై కూడా పడింది అన్నది ఈ మాజీ క్రికెటర్ మాటలతో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: